తెలుగు వార్తలు
Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu
Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 83,806 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,352 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.59 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రెండు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.
Posted: January 22, 2025, 1:37 am
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఏకశిలనగరంలో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై దాడి చేశారని గ్యార ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోచారం పోలీసులు ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. ఈటలతోపాటు దాడికి పాల్పడిన మరో 30 మందిపైనా కేసు నమోదైంది. ఈటలతోపాటు ఏనుగు సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి,
Posted: January 21, 2025, 7:10 pm
హైదరాబాద్ నగరంలో కిడ్నా రాకెట్ కలకలం సృష్టించింది. సరూర్ నగర్ డివిజన్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహణ, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులను
Posted: January 21, 2025, 6:14 pm
ప్రముఖ సినీనటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చొప్రా పంచుకున్నారు. భగవంతుడి దయ అనంతరం అని వ్యాఖ్యానించారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని
Posted: January 21, 2025, 5:27 pm
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా
Posted: January 21, 2025, 4:50 pm
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్యాయత్నం కేసులో తప్పించు తిరుగుతున్న బుర్హానుద్దీన్‌ను మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుపై పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులున్నాయి. భూ కబ్జాతోపాటు బెదిరింపులు, మోసాలు, దాడులు వంటి కేసులున్నాయి. 2011లో మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రికి కూడా నిందితుడు ఫోన్
Posted: January 21, 2025, 4:17 pm
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన కుటుంబసభ్యులతోపాటు మహా కుంభమేళాను సందర్శించారు. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మం విలువలపై విశ్వాసం ఉన్న అదానీ కుటుంబసభ్యులు.. పవిత్ర గంగా ఆశీస్సులు కోరుతూ గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ప్రార్థనలు చేసి, హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా అదానీ
Posted: January 21, 2025, 3:56 pm
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళ కేవలం మూడు నదుల పవిత్ర సంగమం మాత్రమే కాదు.. నమ్మకం, విశ్వాసం, సంస్కృతి సేవ యొక్క గొప్ప సగమం కూడా. ఇక కోట్లమంది భక్తులు దర్శించుకునే ఈ పుణ్య కార్యక్రమం నిర్వహణలో ఎంతో మంది భాగస్వాములయ్యారు. ఇందులో అదానీ గ్రూప్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత పెంపొందేలా అదానీ గ్రూప్
Posted: January 21, 2025, 3:50 pm
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎ రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగానే మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు
Posted: January 21, 2025, 3:06 pm
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయనకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. డెహ్రాడూన్ నుంచి మంగళవారం రాత్రి వరకు ఆయన సికింద్రాబాద్
Posted: January 21, 2025, 2:38 pm
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్
Posted: January 21, 2025, 2:17 pm
ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ ఛైర్మెన్ గౌతం అదానీ జనవరి 21వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళను సందర్శించారు. గౌతం అదానీ కుంభమేళాను సందర్శించడం ఆయనలోని ఐక్యత,స్వచ్ఛత,సేవా గుణాలను చాటుతోంది. మానవ సేవే మాధవ సేవ అని భావించే అదానీ.. ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తూ తనవంతు సహాయం కూడా చేస్తున్నారు. మహాకుంభమేళ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఇస్కాన్
Posted: January 21, 2025, 1:43 pm
భారతదేశంలో రైల్వే ప్రయాణం చాలా సాధారణం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ప్రయాణికులకు రిజర్వేషన్ చేసుకోవడానికి సమయం ఉండకపోవచ్చు లేదా తక్షణమే ప్రయాణం చేయవలసి రావొచ్చు. అటువంటి పరిస్థితులలో రిజర్వేషన్ లేని రైళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త రిజర్వేషన్ లేని రైళ్లను
Posted: January 21, 2025, 1:42 pm
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీలత హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్
Posted: January 21, 2025, 1:25 pm
సొంతింటి కల అనేది చాలా మందికి ఒక ముఖ్యమైన జీవిత లక్ష్యం. సొంత ఇల్లు ఉండటం భద్రత, స్థిరత్వం మరియు స్వాతంత్య్రాన్ని సూచిస్తుంది. అయితే పట్టణాలలో స్థలాలు, ఇళ్లు కొనడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో, చాలా మంది అపార్ట్‌మెంట్లు మరియు కమ్యూనిటీలలో ఇల్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కమ్యూనిటీలో ఇల్లు కొనడం అనేది చాలా
Posted: January 21, 2025, 12:14 pm
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. పేదల భూములు ఆక్రమించుకుంటున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో మంగళవారం ఈటల రాజేందర్ పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్
Posted: January 21, 2025, 12:02 pm
ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోల్ పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యుల బృందం.. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో షూ మాకర్ తో పలు దఫాలు చర్చలు జరిపింది. ఆ చర్చలు విజయవంతం
Posted: January 21, 2025, 11:55 am
ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల మ్యానిఫెస్టోను సైతం మూడు విడతలుగా విడుదల చేస్తోంది. ఇందులో తొలి భాగాన్ని ఇప్పటికే విడుదల చేసిన కాషాయ పార్టీ.. ఇవాళ రెండో పార్ట్ ను విడుదల చేసింది. ఇందులో కేజీ నుంచి పీజీ
Posted: January 21, 2025, 11:37 am
Donald Trump's swearing-in ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే కేపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలను స్వీకరించారు.
Posted: January 21, 2025, 11:22 am
ఛత్తీస్ ఘడ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గరియా బండ్ ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూంబింగ్ లో ఉన్న భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య భారీ ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి.ఇందులో 20 మంది నక్సల్స్ చనిపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్
Posted: January 21, 2025, 10:45 am
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. ఈ
Posted: January 21, 2025, 9:44 am
ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ ను నియమించాలనే డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి. అయితే నిన్న టీడీపీ అధిష్టానం వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ
Posted: January 21, 2025, 9:40 am
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే అందరికీ షాకులిస్తున్నారు. అమెరికాలో అధికారం మారినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని భావించిన వారంతా ఇప్పుడు ట్రంప్ దూకుడుతో షాకవుతున్నారు. ముఖ్యంగా గత బైడెన్ ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న అధికారులను వచ్చీ రాగానే ట్రంప్ తొలగించేశారు. ఏమాత్రం ఊహించని విధంగా ట్రంప్ ఇస్తున్న
Posted: January 21, 2025, 9:10 am
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడునెలలవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనం ఎన్నికల్లో వేసిన ఓటుతో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వచ్చీ రాగానే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. కీలకమైన స్ధానాల్లో తనకు కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే మరికొందరిని
Posted: January 21, 2025, 7:41 am
Sensex: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం మాటేంటో గానీ భారత్‌కు మాత్రం కలిసి రానట్టే కనిపిస్తోంది. ఆయన బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఏకంగా 5.5 లక్షల రూపాయలు హరించుకుపోయాయి. నష్టాలతో దలాల్ స్ట్రీట్ దడదడలాడింది. ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్
Posted: January 21, 2025, 7:18 am
చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. రైతుల విషయంలో పనులు ఆలస్యం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే అకాల వర్షాలవల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన పడుతుంటే అందులో 25 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ లో
Posted: January 21, 2025, 7:05 am
ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పార్టీ నేత రాజేష్ మహాసేన మొదలుపెట్టిన డిమాండ్ ను ఆ తర్వాత ఇతర నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, బుద్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ అందుకున్నారు. అయితే నిన్న ఉన్నట్లుండి టీడీపీ అధిష్టానం దీనిపై స్పందించి
Posted: January 21, 2025, 6:52 am
World Economic Forum 2025:రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తొలి రోజు ఆయన పాల్గొన్నారు. తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
Posted: January 21, 2025, 5:58 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాష్ట్రానికి వరుసగా సంస్థల్ని కేటాయిస్తున్నకేంద్ర ప్రభుత్వం తాజాగా కోనసీమ జిల్లాలోని నదీ ముఖద్వారం అంతర్వేదికి గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్వేదికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కీలకమైన సంస్థను ఇక్కడ కేటాయించింది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి
Posted: January 21, 2025, 4:48 am
Vande Bharat Express Trains: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ఇచ్చింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద దేశవ్యాప్తంగా అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించే వెసలుబాటు కల్పించింది. దీనితో పాటు తేజస్, హమ్‌సఫర్‌లల్లో కూడా ఎల్టీసీని వర్తింపజేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ
Posted: January 21, 2025, 4:45 am